ఢిల్లీకి చేరుకున్న జగన్.. రేపు మోదీతో భేటీ

05-10-2020 Mon 20:03 | Andhra
  • ఇద్దరు ఎంపీలు, 10 మంది బృందంతో ఢిల్లీ చేరుకున్న జగన్
  • నేరుగా ఏపీ భవన్ కు చేరుకున్న సీఎం
  • పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీకి చేరుకున్నారు. ఆయనతో పాటు ఇద్దరు ఎంపీలు, 10 మందితో కూడిన బృందం ఢిల్లీకి వెళ్లింది. ప్రత్యేక విమానంలో వీరంతా దేశ రాజధానికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం వద్ద జగన్ కు వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఏపీ భవన్ కు చేరుకున్నారు. ఈ రాత్రికి ఆయన అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు.

పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. ఈ సమావేశాల సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై జగన్ చర్చించనున్నారు. నదీజలాల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జగన్ పాల్గొననున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.

మరోవైపు, ఎన్డీయేలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తూ, కేంద్ర మంత్రి పదవులను వైసీపీకి మోదీ ఆఫర్ చేశారనే వార్తల నేపథ్యంలో జగన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.
JaganYSRCPDelhi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more